
బ్యూటీ రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన క్యూట్‌నెస్‌తో మతిపొగొడుతుంది. ప్రస్తతం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ పైకన్ను వేసింది. అక్కడ వరసగా సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

రీసెంట్‌గా తెలుగులో తెలుసు కదా అనే మూవీలో సిద్దు జొన్నల గడ్డ సరసన నటించి మెప్పించింది. ఇక ఈ మూవీ థియేటర్లో రిలీజై, ఊహించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈ చిన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక తెలుగులోనే కాకుండా, తమిళంలో, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూట క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. అవి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.