
కొత్తగా ట్రై చేసినా.. బేస్‌ని వదలకుండా కవర్ చేయాలన్నది పుష్ప పబ్లిసిటీ స్ట్రాటజీ. అందుకే హీరో, హీరోయిన్లు ముందుండి పబ్లిసిటీ పనులు చూసుకుంటున్నారు.

బన్నీ బ్రాండింగ్ ఏ రేంజ్‌లో ఉందంటే.. నార్త్ సినిమాకు ఆడియన్స్‌ను రప్పించడానికి కూడా అల్లు అర్జున్ కటౌట్‌ను వాడుకుంటున్నారు మేకర్స్.

పుష్ప సినిమా సౌత్‌లో కంటే నార్త్‌లోనే బిగ్ హిట్ అయ్యింది. బన్నీ మేనియా ఉత్తరాదిని షేక్ చేసింది. అందుకే పుష్ప 2 కోసం సౌత్ ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో, నార్త్ ఆడియన్స్ అంతకు మించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

తొలి భాగం నార్త్‌లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద కూడా బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు పుష్ప 2 మేకర్స్.

రెండు నిమిషాల 44 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో.. ఇలా వ్యూస్ అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ట్రైలర్‌లో ప్రతి కేరక్టర్ గురించీ మాట్లాడుకుంటున్నారు జనాలు.

అందుకే భూల్ బులయ్య 3 రిలీజ్ అయ్యే సింగిల్ స్క్రీన్స్‌లో 30 అడుగుల పుష్పరాజ్ కటౌట్‌ను ఏర్పాటు చేస్తామని థియేటర్లకు హామీ ఇచ్చారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా భూల్ బులయ్య 3 సినిమా మీద హైప్ పెంచటంతో పాటు..

పుష్ప 2కు భారీగా ప్రమోషన్ కూడా అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు నార్త్ మేకర్స్. హిందీ సినిమా ప్రమోషన్ కోసం కూడా బన్నీ ఇమేజ్ వాడుకోవటం చూసి, అల్లు ఆర్మీ పండుగ చేసుకుంటోంది.