Pushpa 2: రిలీజ్ రూమర్స్‏కు చెక్ పెట్టిన పుష్పా మేకర్స్..

| Edited By: Phani CH

Jan 04, 2024 | 1:36 PM

తొందరపడి ఏదో ఒకటి చేయను.. ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాను అంటూ ఓ సినిమాలో ఎమ్మెస్ నారాయణ డైలాగ్ చెప్తారు గుర్తుందా..? ఇప్పుడు సుకుమార్ అండ్ టీం కూడా ఇదే చేస్తున్నారు. పుష్ప 2 విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.. కంగారు పడటం లేదు లెక్కల మాస్టారు. రిలీజ్ డేట్ విషయంలోనూ తన ప్లానింగ్స్ తనకున్నాయంటున్నారు. మరి అవేంటో చూద్దామా..? సుకుమార్ ఫోకస్ అంతా ఇప్పుడు పుష్ప 2పైనే ఉంది. ఈ చిత్రంతో తను కూడా 1000 కోట్ల లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు.

1 / 5
ఐటమ్ సాంగ్స్ ఇవ్వటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న దేవీ శ్రీ ప్రసాద్‌, పుష్ప 2 కోసం మరో బ్లాక్ బస్టర్ ట్యూన్‌ను సిద్ధం చేశారు. ఈ పాటతో మరోసారి థియేటర్లను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు పుష్పరాజ్‌.

2 / 5
సుకుమార్ ఫోకస్ అంతా ఇప్పుడు పుష్ప 2పైనే ఉంది. ఈ చిత్రంతో తను కూడా 1000 కోట్ల లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. అందుకే మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ముందు చెప్పినట్లుగానే ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది పుష్ప 2.

3 / 5
రిలీజ్ డేట్ మారిందంటూ జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని తేల్చేసింది చిత్రయూనిట్. ఆగస్ట్ 15న రావడానికి కారణాలు కూడా లేకపోలేదు. 5 రోజుల లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ కలెక్షన్లపై కన్నేసారు పుష్ప రాజ్. ఒకవేళ సుకుమార్ అనుకుంటే సమ్మర్‌లో కూడా పుష్ప 2ను విడుదల చేయొచ్చు కానీ ఆలస్యమైనా.. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోనే రావాలని చూస్తున్నారు మేకర్స్.

4 / 5
మార్చ్ వరకు పుష్ప 2 షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నెల రోజులు తీసుకున్నా.. జూన్, జులై అంతా ప్రమోషన్స్ కోసమే కేటాయించాలని చూస్తున్నారు సుకుమార్ అండ్ టీం.

5 / 5
బాలీవుడ్‌లోనూ పుష్ప 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే నార్త్‌పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ఎలా చూసుకున్నా.. కంగారేం లేకుండా కాంప్రమైజ్ కాకుండా పుష్ప రాజ్‌ను బరిలోకి దించుతున్నారు లెక్కల మాస్టారు.