
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఓ ప్రైవేట్ ఈవెంట్ కోసం ముంబైకి వచ్చింది. ఆమె కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండనుంది. కాగా తనకెంతో ఇష్టమైన ముంబై నగరంలో తాను గడిపిన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది ప్రియాంక.

తాజాగా ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకుంది ప్రియాంక . ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తిని కూడా ఆలయానికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దేవాలయంలోని అర్చకులు ప్రియాంక, ఆమె కూతురికి ఆశీర్వచనం అందజేశారు

కాగా ప్రియాంక పెళ్లి చేసుకుని అమెరికాలోనే స్థిరపడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె భారతీయ సంప్రదాయాలను ఆమె మర్చిపోలేదు. విదేశాలలో కూడా భారతీయ పండగలను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది.

ఈక్రమంలోనే తాజాగా ముంబై సిద్ది వినాయకుడిని దర్శించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.