
90వ దశకంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా వెలుగొందాడు వినిత్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు

జెంటిల్ మెన్, సరిగమలు, W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర చిత్రాలు వినీత్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

అన్నట్లు హీరోగానే కాకుండా వినీత్ మంచి డ్యాన్సర్ కూడా. ముఖ్యంగా భరతనాట్యంలో అనేక కచేరీలలో తన ప్రతభను ప్రదర్శించాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే.. వినీత్.. 2004 ఆగస్ట్ 28న చెన్నైకు చెందిన ప్రిస్సిల్లా మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పాప అవంతి వినీత్ జన్మించింది.

వినీత్ ఫ్యామిలీ సాధారణంగా బయట ఎక్కువగా కనిపించదు. అయితే తాజాగా నెట్టింట వినీత్ ఫ్యామిలీ ఫోటోస్ మాత్రం కొన్ని చక్కర్లు కొడుతున్నాయి