
ఎన్నో దశాబ్దాల తరువాత తెలుగు తెర మీద సూపర్ హీరోను చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా ఫాంటసీ మూవీస్‌తో ఓ సూపర్ హీరో యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ యూనివర్స్‌కు సంబంధించి మరో మేజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

హనుమాన్ సినిమాతో సూపర్ హీరో యూనివర్స్‌ను స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ, ఆ సిరీస్‌లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ యూనివర్స్‌లో రెండు ప్రాజెక్ట్స్ ఎనౌన్స్ అయ్యాయి. ఆ సినిమాలను ప్రశాంత్ వర్మ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు.

పీవీసీయులో మరో మూవీ ప్రకటించారు ప్రశాంత్ వర్మ. పీవీసీయులో మూడో సినిమాగా మహాకాళీ అనే లేడీ సూపర్ హీరో మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు ప్రశాంత్ వర్మ.

ఈ సినిమాను తాను స్వయంగా డైరెక్ట్ చేయకుండా కేవలం నిర్మాతగా వ్యవహరిస్తూ పూజ కొల్లురును దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇలా ఇతర దర్శకులతో తన బ్యానర్‌లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తన స్వీయ దర్శకత్వంలో ఎనౌన్స్ చేసిన అధీరా, జై హనుమాన్, నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. వీటిలో కనీసం రెండు ప్రాజెక్ట్స్ అయినా 2025లో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ట్రై చేస్తున్నారు ప్రశాంత్ వర్మ.