
కానీ ఫైనల్‌గా డైలమాలో ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది డార్లింగ్ టీమ్. లాస్ట్ ఇయర్ కల్కి 2898 ఏడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ప్రజెంట్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు.

ఆ రెండు సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకువస్తారన్న టాక్ వినిపించింది. కానీ షూటింగ్స్ డిలే కావటంతో ఈ క్యాలెండర్‌లో ప్రభాస్ సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.

కానీ లేటెస్ట్ అప్‌డేట్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న కన్నప్పలో గెస్ట్ రోల్‌లో కనిపిస్తున్నారు డార్లింగ్. అదే సమయంలో మరో బిగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.

చాలా కాలం తరువాత ప్రభాస్ చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ది రాజాసాబ్‌ను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో రిలీజ్ డేట్ మీద దృష్టి పెట్టారు మేకర్స్.

దసరా సీజన్‌లో టఫ్ ఫైట్ ఉంది కాబట్టి, డిసెంబర్ లో డేట్ లాక్ చేయాలని భావిస్తున్నారు. పుష్ప, పుష్ప 2 సినిమాలు రిలీజ్ అయిన డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే ది రాజాసాబ్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసే ఆలోచనలో ఉంది డార్లింగ్ టీమ్.