
స్పిరిటీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్‌లో మూడు షేడ్స్ ఉంటాయట. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే మరోటి మాఫియా డాన్ అని, ఇంకోటి లవర్ భాయ్ క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

మహేష్ మూవీ కోసం వరుసగా మల్టీ లింగ్యువల్ స్టార్స్‌ను కాస్ట్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్టుగా వెల్లడించారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఆర్ మాధవన్ కూడా చేరినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ప్రజెంట్ అఖండ 2 వర్క్‌లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ మూవీని కన్ఫార్మ్ చేశారు. మరోసారి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో నెక్ట్స్ హిస్టరికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

మోస్ట్ అవెయిటెడ్ ఓజీ వర్క్ కూడా పూర్తి చేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌లో తన పోర్షన్ అంతా కంప్లీట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ అవ్వటంతో షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడు కూడా పెంచారు మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కోసం డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ముందు బెగ్గర్ అనే టైటిల్ వినిపించినా... ఇప్పుడు 'భవతీ భిక్షాందేహీ' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ విషయంపై త్వరలో క్లారిటీ రానుంది.