Rajeev Rayala |
Jan 05, 2022 | 8:58 PM
ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
దేశంలోని ప్రస్తుత పరిస్థితులలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సినిమా వాయిదా వేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మేకర్స్.
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమాను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు మేకర్స్.
దీంతో రాధేశ్యామ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ విక్రమాధిత్య పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్స్ సృష్టిస్తోంది.