
ప్రమోషన్ ఏదైనా ఆ ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతున్నారు కల్కి 2898ఏడీ మేకర్స్. కల్కి ప్రమోషన్లు షురూ చేసినప్పటి నుంచీ ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్.

నియర్ ఫ్యూచర్‌లోనూ ప్రమోషన్లలో ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతారా? అంటూ ఇష్టంగా ఆరా తీస్తున్నారు. ఇంతకీ అంతగా కిక్ ఇస్తున్న స్ట్రాటజీ ఏంటి.? ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి2898ఏడీ.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అందుకే ప్రతి చిన్న అప్‌డేట్‌నీ నిశితంగా పరిశీలిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.

కల్కి ప్రమోషన్లలో టీమ్ ఓ స్పెషల్ థీమ్‌ని ఫాలో అవుతుందని అంటున్నారు. ఇప్పటిదాకా కల్కికి సంబంధించి ప్రభాస్ సోలోగా ఎప్పుడూ కనిపించలేదు. ట్రైలర్ లో టీమ్ అంతా కనిపించింది.

ఆ తర్వాత అశ్వత్థామ వీడియో అమితాబ్ మీద విడుదలైంది. బుజ్జిలో ప్రభాస్‌తో కీర్తీసురేష్ వాయిస్ కారు రూపంలో ట్రావెల్ చేసింది. రకరకాల సిటీల్లో తిరుగుతూ కల్కికి ప్రమోషన్లు చేసి పెడుతోంది స్పెషల్ కారు బుజ్జి.

లేటెస్ట్ బైరవ యాంథమ్ విషయంలోనూ స్పెషల్ థీమ్‌నే ఫాలో అయ్యారు మేకర్స్. ఇందులో ప్రభాస్‌ని విడిగా చూపించకుండా సింగర్ దిల్జిత్‌ని కూడా వీడియో చూపించారు.

సంతోష్ నారాయణ్ మ్యూజిక్‌లో హైప్ పెంచుతోంది భైరవ యాంథమ్. సాంగ్‌లో ప్రభాస్ స్టైలిష్ వాక్ యమాగా ఉందని ఉప్పొంగిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.