టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని ఠక్కున చెప్పొచ్చు. ఆయన పెళ్లి కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని ఠక్కున చెప్పొచ్చు. ఆయన పెళ్లి కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

అప్పట్లో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు అంతా. కానీ ఆ సినిమా విడుదలై ఇన్నేళ్లైన పెళ్లి మాటకు దూరంగా ఉంటున్నాడు ప్రభాస్. ఇటీవల అన్ స్టాపబుల్ షోలో సైతం తన పెళ్లి గురించి మాట దాటేశాడు.

దీంతో ప్రభాస్ పెళ్లి గురించి ఎదురుచూసిన అభిమానులు.. ఇప్పుడు సోషల్ మీడియాలో డార్లింగ్ పెళ్లి చేసేసారు. ఇంతకీ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా ?. తనే హీరోయిన్ అనుష్క. వీరిద్దరి జంటకు వివాహం జరిగినట్లుగా ఆర్టిఫిషియల్ ఫోటోస్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటోలో ప్రభాస్, అనుష్క ఏఐ పిక్స్ ఎంతో అందంగా ఉన్నాయి. ఆ ఫోటోస్ చూస్తే నిజమేనా అనే సందేహం కలగకమానదు.

కొద్ది రోజుల క్రితం అనుష్క, ప్రభాస్ ఫ్యామిలీ.. వారికి ఓ పాప అంటూ నెట్టింట కొన్ని పిక్స్ వైరల్ కాగా.. ఇప్పుడు పెళ్లి క్రతువు పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి.