
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఫస్ట్ టైమ్ పోలీస్ డ్రెస్‌లో చూపించబోతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. యానిమల్‌తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్, డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన డైరెక్టర్, ప్రజెంట్ మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో కాస్టింగ్‌ను కూడా ఫైనల్ చేస్తున్నారు. ముందు ప్రభాస్‌కు జోడీగా టాప్ బ్యూటీ దీపికను తీసుకోవాలనుకున్నా... ఆమె భారీ డిమాండ్స్ పెట్టడంతో లైట్ తీసుకున్నారు.

ఫైనల్‌గా డార్లింగ్‌కు జోడీని సెట్ చేశారు సందీప్ రెడ్డి వంగా. మోస్ట్ అవెయిటెడ్ మూవీలో యానిమల్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రీకి ఛాన్స్ ఇచ్చారు. ఈ నిర్ణయం దీపికతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ ఇచ్చింది.

లేటెస్ట్ పోస్టర్‌తో మరో క్లారిటీ కూడా ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. స్పిరిట్ సినిమాను ఏకంగా తొమ్మిది భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫార్మ్ చేశారు. ఐదు భారతీయ భాషలతో పాటు నాలుగు ఫారిన్ లాంగ్వేజెస్‌లోనూ ఆడియన్స్ ముందుకు రానుంది స్పిరిట్.

Spirit Movie