
ఒక్కోసారి అందరిలా ఉండకపోవడమే.. అందరినీ చేరువ చేస్తుంది. యాక్టింగ్ కెరీర్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ చేస్తున్నదిదే. ఆయనకంటూ సెపరేట్ నైజం ఉంది. అదే పవనిజం. అందుకే ఆయన చెప్పిందే నిజం.. పవన్ ట్రెండ్ ఫాలో అవ్వరు..

ట్రెండ్ సెట్ చేస్తారు. టైమ్ కలిసొచ్చినపుడు.. ఫ్లాపయ్యే మూవీ కూడా హిట్ అవుతుంది. కానీ అదే కాలం బ్యాడ్ అయితే.. హిట్ కావాల్సిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుంటాయి. పవన్ కెరీర్‌లో పదేళ్లు అట్టాగే గడిచిపోయాయి.

ఖుషీ తర్వాత ఒక్క చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ కాలేదు. వరసగా ఆరు విజయాలు అందుకున్న పవన్.. ఒక్క హిట్ కోసం ఎన్నో సంవత్సరాలు వేచి చూసారు. అయినా కూడా కల్యాణ్ ఇమేజ్ మాత్రం అలాగే ఉంది.

బద్రి - ఏయ్.. నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్.. అయితే ఏంటి?

తొలిప్రేమ - నిజమైన ప్రేమకి అర్ధమేంటో తెలుసా.. మనం ప్రేమించినవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే

పంజా - సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో! సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు.

అత్తారింటి దారేది - జీతాలిచ్చే వాళ్ళ పైన జోకులేస్తే.. ఇలానే జీవితం తలకిందులైపోద్ది ఎదవ.

తీన్ మార్ - కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం.

అత్తారింటికి దారేది - చూడప్ప సిద్దప్ప… నేనొక మాట చెప్తాను.. పనికొస్తే ఈడ్నే వాడుకో.. లేదంటే ఏడనైనా వాడుకో.. నేను సింహాలాంటోడినప్ప .. అది గడ్డం గీసుకోలేదు!! నేను గీసుకోగలను.. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్..

గబ్బర్ సింగ్ - పాపులారిటదేముంది.. అది పాసింగ్ క్లౌడ్ లాంటిది.. వాతావరణం వేడిక్కితే వానై కరిగిపోతుంది. నేను ఆకాశం లాంటోడిని.. ఉరుమొచ్చిన, పిడుగొచ్చినా, మెరుపొచ్చినా.. నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను.

గబ్బర్ సింగ్ 2 - నేనొచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి.. టైం మారాలి, టైం టేబుల్ మారాలి.. మారకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా..