
లాస్ట్ శుక్రవారం మంగళవారం సందడి చేసింది. తిరిగి చూసేలోపు ఈ శుక్రవారం వచ్చేసింది. ఈ సారి కూడా యూత్‌ని అలరించడానికి మూవీస్ లైన్లోకి వచ్చాయి. వైష్ణవ్‌తేజ్, శ్రీలీల సినిమా ఆదికేశవతో పాటు లింగి లింగి లింగిడి అంటూ కుర్రకారును పాటతో ఊపు ఊపిన కోటబొమ్మాళి పీయస్ కూడా థియేటర్లలో అడుగుపెట్టింది.

నీకు కంఫర్ట్ గానే ఉంది కదా.. అని శ్రీలీల అన్న ఒకే ఒక్క డైలాగ్‌తో యూత్‌ని టిక్కెట్ కౌంటర్ల ముందు క్యూ కట్టేలా చేసింది ఆదికేశవ సినిమా. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిందని చూడగానే అర్థమైపోతుంది.

యూత్‌ఫుల్ కంటెంటే కాదు, ఎమోషనల్‌గానూ అందరికీ కనెక్ట్ అవుతుందని అంటున్నారు మేకర్స్. హైదరాబాద్‌లో ఉన్న కుర్రాడు అనంతపురం సమీపంలో జరిగే దారుణాలను ఎలా అడ్డుకున్నాడన్న కథతో తెరకెక్కింది ఆదికేశవ. ఈ మూవీతో పోటీ పడుతోంది కోటబొమ్మాళి పీయస్. సిస్టమ్‌లో జరిగే అంశాలే ప్రధాన వస్తువుగా ఈ సినిమా చేశామని అంటున్నారు మేకర్స్.

పొలిటీషియన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు . దీని వల్ల పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే కథతో తెరకెక్కింది కోట బొమ్మాళి. శ్రీకాకుళం జానపదం లింగి లింగి లింగిడి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది

ఈ సినిమాలతో పాటు ఈ వారం సౌండ్ పార్టీ, పర్ఫ్యూమ్, ది ట్రయల్ అనే ఓ చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి అడుగుపెట్టాయి. మరి మీ ఓటు దేనికో కామెంట్ల రూపంలో తెలియజేయండి.