
ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకుంటారనుకున్న పూజ హెగ్డే సడన్‌గా స్లో అయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు కూడా డిజాస్టర్స్ కావటంతో అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో కొంత కాలం ఫిలిం సర్కిల్స్‌లో పూజ పేరే వినిపించలేదు.దేవా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేదు. రీసెంట్‌గా రెట్రో సినిమాతో సక్సెస్ దక్కినా... పెద్దగా బజ్ అయితే రాలేదు.

అందుకే సక్సెస్ ఫెయిల్యూర్ల విషయంలో వేదాంతం మాట్లాడుతున్నారు బుట్టబొమ్మ. కెరీర్‌లో ఫెయిల్యూర్స్‌ను యాక్సెప్ట్ చేయాలంటున్నారు ఈ బ్యూటీ. అలా అంగీకరిస్తేనే... కొత్తగా ప్రేక్షకులకు అలరించే అవకాశం ఉంటుందన్నారు.

కెరీర్‌లో ఎత్తు పల్లాలు అందరికీ ఉంటాయంటూ పెద్దరికంగా మాట్లాడుతున్నారు. మరి అనుభవం ఆమె కెరీర్‌కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.ప్రజెంట్ అరవింద్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

విజయ్ ఆఖరి చిత్రం జననాయగన్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో వరుణ్ దావన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఓకే చెప్పారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలతో అయినా అమ్మడి కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి.