చీర.. చిరునవ్వు ఇంతకు మించి ఏం కావాలంటూ.. పాయల్ అందాల హోయలు!
ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన గ్లామర్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ అందాల తారా. మొదటి సినిమాలోనే తన అందంతో టాలీవుడ్‌నే షేక్ చేసింది ఈ చిన్నది.
Updated on: Jan 26, 2025 | 1:37 PM

ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో ఈ బ్యూటీ నటించినప్పటికీ పాయల్ రాజ్ పుత్‌కు అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాలా వరకు ఈ అమ్మడు గ్లామర్ పాత్రల్లో కనిపించి మెప్పించింది.

ఇక తర్వాత ఈ అమ్మడు మంగళవారం సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ అభిమానులకు దగ్గరవ్వడానికి మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ మెళ్లిగా సక్సెస్ వైపు అడుగులు వేస్తుంది.

పాయల్ రాజ్ పుత్ త్వరలో వెంకటలచ్చిమీ సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. మని దర్శకత్వంలో రాజా. ఎన్ ఎస్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ వరస ఫొటో షూట్‌లతో చలికాలంలో కూడా తన అభిమానులకు చెమటలు పట్టిస్తుంది ఈ బ్యూటీ.

ఇక తాజాగా చీర.. చిరునవ్వు ఇంతకు మించి ఇంకేం కావాలి అంటూ...చీరలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. మల్టీకలర్ చీరలో ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.