సడన్‌గా స్పీడు పెంచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస షూటింగ్స్‌తో బిజీ అయ్యారు. ఆల్రెడీ హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యింది. ఆ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని వెంటనే ఓజీ వర్క్ స్టార్ట్ చేశారు.

ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నెలలోనే ఓజీ వర్క్‌ను పూర్తి చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెడీగా ఉన్న సుజిత్, పవన్ టైమ్ ఏ మాత్రం వేస్ట్ చేయకుండా షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ రెడీ టు రీస్టార్ట్ అన్న ఎనౌన్స్‌మెంట్ ఇచ్చిన ఉస్తాద్ టీమ్ జూన్ రెండో వారం నుంచి షూటింగ్‌కు రెడీ అవుతోంది. అయితే గతంలో పవన్ ఓకే చేసిన స్క్రిప్ట్‌కు ఇప్పుడు తెరకెక్కిచబోయే స్క్రిప్ట్‌కు చాలా తేడా ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఉస్తాద్ భగత్‌సింగ్ ఎనౌన్స్‌మెంట్ టైమ్‌లో పవన్ రాజకీయనాయకుడు మాత్రమే. కానీ ఇప్పుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. అందుకే ఆయన ప్రజెంట్ ఇమేజ్‌కు, పోజిషన్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు హరీష్ శంకర్. అదే సమయంలో పవన్ డేట్స్ కూడా వీలైనంత తక్కువ వాడేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.