OG: పవన్ మనసు మారిందా.. OG ముందే వస్తున్నాడా..?

Edited By: Phani CH

Updated on: Feb 17, 2025 | 9:40 PM

అక్కడ స్పేస్ లేదు.. కానీ తీసుకున్నారు అంటూ అప్పట్లో సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ మాట్లాడిన స్పీచ్ గుర్తుందిగా..! పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను చూస్తుంటే ఇదే గుర్తుకొస్తుందిప్పుడు. అక్కడ ఓజి అప్‌డేట్ ఏం లేదు.. కానీ ఆ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు అభిమానులు. ఓజి అప్‌డేట్స్ ఇస్తున్నారు. మరి తాజాగా ఈ చిత్రంపై వచ్చిన న్యూస్ ఏంటి..?

1 / 5
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచేవరకు ఓ టెన్షన్.. గెలిచిన తర్వాత అభిమానులకు మరో టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు ఆయనున్న బిజీకి సినిమాలు చేయడం కష్టమే. అందుకే ఆ ఒప్పుకున్న రెండు సినిమాలైతే చేయండి సామీ అంటున్నారు.

2 / 5
స్పెషల్‌గా ఓజి పూర్తి చేయాలంటున్నారు. అందుకే మేకర్స్ అప్‌డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. సోషల్ మీడియా మాత్రం ఓజితో మోత మోగుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తాజాగా థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చేసారు.

3 / 5
దానికి డిప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. కానీ అక్కడ ఫ్యాన్స్ మాత్రం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా.. పవర్ స్టార్‌లా ట్రీట్ చేసారు. ఓజి ఓజి అంటూ తమ కేకలతో ఈవెంట్‌ను మోత మోగించారు. దాంతో తమన్ కూడా ఓజి పాటే పాడక తప్పలేదు.

4 / 5
ఈ ఈవెంట్ తర్వాత మరోసారి నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది ఓజి. పైగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారనే వార్తలొస్తున్నాయి. అన్నీ కుదిరితే అక్టోబర్‌లో ఓజి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పవన్ ఎప్పుడొచ్చినా.. స్క్రిప్ట్ సిద్ధమే అంటున్నారు దర్శకుడు సుజీత్. హరిహర వీరమల్లు సైతం చివరిదశకు వచ్చేసింది.

5 / 5
ఓజిపై ఉన్న అంచనాలు చూస్తుంటే.. అది ఎప్పుడు విడుదలైన బాక్సాఫీస్ దగ్గర రికార్డుల కుంభవృష్టి ఖాయంగా కనిపిస్తుంది. పవన్ కాస్త కాన్సట్రేట్ చేసి ఆ మిగిలిన షూట్ పూర్తి చేస్తే చాలు.. మిగిలింది చూసుకోడానికి మేం ఉన్నామంటున్నారు ఫ్యాన్స్. మరి ఈసారైనా అభిమానుల కోరికను పవన్ మన్నిస్తారో లేదో చూడాలి.