
పవన్ కల్యాన్ కాంపౌండ్ నుంచి మరో మేజర్ అప్‌డేట్ వచ్చింది. పొలిటికల్ బిజీతో సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ మళ్లీ నెమ్మదిగా సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్, ఇప్పుడు మరో మూవీని కూడా లైన్‌లో పెట్టేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వరుస సినిమాలు లైన్‌లో ఉన్నా... పొలిటికల్ బిజీ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవర్ స్టార్. దీంతో సిల్వర్ స్క్రీన్ మీద పవర్ మేనియాను మిస్ అవుతున్నారు అభిమానులు. రాజకీయాల్లో బిజీ కావటంతో మళ్లీ పవన్ సినిమాలు చేస్తారా... చేస్తే ఎప్పుడూ? అన్న సస్పెన్స్ చాలా రోజులు కంటిన్యూ అయ్యింది. ఫైనల్‌గా సినిమాలకు కూడా టైమ్ ఇస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు పవన్.

హరిహరవీరమల్లు నుంచి ఓ అప్‌డేట్ రాగానే, అందరూ ఓజీ మేకర్స్ వైపు చూస్తున్నారు. అటు నుంచి చప్పుడు కాగానే, ఇటు చూడటం అలవాటుగా మారింది. ఒకే సీజన్‌లో వచ్చే సినిమాల మధ్య పోటీ ఉండటం మామూలేగానీ,

ఈ సినిమా కోసం మేకర్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు ఈ సినిమాతో పాటు ఓజీ కోసం కూడా అంతే ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. దీంతో హరిహరవీరమల్లు వర్సెస్ ఓజీ అన్నట్టు తయారైంది సిట్చువేషన్.

గబ్బర్‌సింగ్ కాంబోలో ఉస్తాద్ భగత్‌సింగ్ వస్తుందని తెలియగానే పక్కా కమర్షియల్ హిట్ అని అనుకున్నారు జనాలు. దానికి తగ్గట్టుగానే ఎన్నికల సమయంలోనూ హల్ చల్ చేసింది ఉస్తాద్ భగత్‌సింగ్.