
పవన్ కల్యాణ్ పర్యటన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల మీదుగా సాగనుంది.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కల్యాణ్ ఇటీవల డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు.

నష్టాన్ని అంచనా వేసి త్వరగా రైతులకు సాయం అందించాలని కోరారు. ప్రకృతి విపత్తులలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు జనసేన ప్రభుత్వం రాగానే ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని చెప్పారు.

పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి పర్యటనలో ఆయన వెంట.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పలువురు నాయకులు ఉన్నారు.

కాగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పవన్‌కు అభిమానులు, కార్యకర్తలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఆ ఫోటోలు ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.