
హరి హర వీరమల్లు రిలీజ్‌కు ముందు థియేటర్లు బంద్ చేయాలంటూ ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెంచుతోంది. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి పెద్దలు స్పందించటంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టుగానే అనిపించింది.

కానీ పవన్ తాజా నిర్ణయాలతో మరోసారి ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుత పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్‌తో చర్చించిన పవన్ కల్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా బంధ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్, దీని వెనుక ఉన్న పాత్రధారుల ఎవరో విచారణ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా సినిమా హాల్స్‌లోని స్టాల్స్‌లో అమ్మే ఆహార పదార్ధాల ధరలపై నియంత్రకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆడియన్స్ థియేటర్లకు రావాలంటే ఫుడ్ కూడా అందుబాటు ధరల్లో ఉంటేనే సాధ్యమవుతుందని అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టికెట్ రేట్ల పెంపు విషయంలోనూ కీలక ఆదేశాలు ఇచ్చారు.

తన సినిమా టికెట్ రేటు పెంచాలన్నా... వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టంగా చెప్పారు. ఈ నిర్ణయాలతో ఇన్నాళ్లుగా ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య ఉన్న ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్ ఇక మీదట ఉండకపోవచ్చు అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.