Film News: కొంతకాలం షూటింగ్స్ కి డార్లింగ్ బ్రేక్ .. జపాన్‌కు సాయి పల్లవి..

| Edited By: Prudvi Battula

Feb 04, 2024 | 11:51 AM

గత ఆరేడు నెలలుగా క్షణం తీరికలేకుండా వరసగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ప్రభాస్. జవాన్‌తో బాలీవుడ్‌ను ఊపేసిన అట్లీ.. ప్రస్తుతం హిందీలో నిర్మాతగా మారారు. తెరీని వరుణ్ ధావన్‌తో తనే నిర్మాతగా రీమేక్ చేస్తున్నారు. చెల్లి పెళ్లి పనులతో కొన్ని రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నారు సాయి పల్లవి. త్వరలోనే నాగ చైతన్య తండేల్ సెట్‌లో జాయిన్ కానున్నారు. సుహాస్, శివానీ జంటగా దుశ్యంత్ కటికనేని తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ఏడోసారి సినిమా చేయబోతున్నారు దర్శకుడు ప్రియదర్శన్.

1 / 5
గత ఆరేడు నెలలుగా క్షణం తీరికలేకుండా వరసగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ప్రభాస్. ఓ వైపు సలార్.. మరోవైపు కల్కి.. ఇంకోవైపు ఖాళీ టైమ్ దొరికినపుడు మారుతి రాజా సాబ్ సినిమాలు పూర్తి చేస్తున్నారు ప్రభాస్. అందుకే నెల రోజులకు పైగానే బ్రేక్ ఇవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే యూరప్ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

2 / 5
జవాన్‌తో బాలీవుడ్‌ను ఊపేసిన అట్లీ.. ప్రస్తుతం హిందీలో నిర్మాతగా మారారు. తెరీని వరుణ్ ధావన్‌తో తనే నిర్మాతగా రీమేక్ చేస్తున్నారు. ఖలీస్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మధ్యే మూవీ ఓపెనింగ్ జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో కీర్తి ఫోటో పోస్ట్ చేస్తే.. డేట్స్ ఇవ్వు అమ్మా అంటూ వరుణ్ ధావన్ రిప్లై ఇచ్చారు.. ఇది వైరల్ అవుతుందిప్పుడు.

3 / 5
చెల్లి పెళ్లి పనులతో కొన్ని రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నారు సాయి పల్లవి. త్వరలోనే నాగ చైతన్య తండేల్ సెట్‌లో జాయిన్ కానున్నారు. దాంతో పాటు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు సాయి పల్లవి. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జపాన్‌లో జరగనుంది. తండేల్ షెడ్యూల్ తర్వాత అమీర్ కొడుకు సినిమాకు వెళ్లనున్నారు సాయి పల్లవి.

4 / 5
సుహాస్, శివానీ జంటగా దుశ్యంత్ కటికనేని తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి 2న విడుదలఅయింది ఈ చిత్రం. ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. దీనికి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా విజయం సాదించింది.

5 / 5
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ఏడోసారి సినిమా చేయబోతున్నారు దర్శకుడు ప్రియదర్శన్. ఈ కాంబినేషన్‌లో వచ్చిన హెరా పెరీ, భూల్ భులయ్యా లాంటి సినిమాలు విజయం సాధించాయి. తాజాగా ఏడో సారి ఈ జోడీ సినిమా చేయబోతున్నారు. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని.. స్ట్రెయిట్ సినిమా అని తెలిపారు ప్రియదర్శన్.