
ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ ప్రభాస్ ఇండియాకు వచ్చేసారు.. ఆయన రాగానే సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది.. ప్రభాస్ రాకను కూడా పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. వాళ్ల ఆనందానికి కారణం లేకపోలేదు.

మరి వచ్చీ రాగానే ప్రభాస్ ప్లాన్ ఏంటి..? సలార్ ప్రమోషన్ మొదలవుతుందా.. ప్రాజెక్ట్ కే కదులుతుందా.. సందీప్ సినిమా సెట్స్‌పైకి వస్తుందా..? వెకేషన్స్ విషయంలో మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రభాస్ కాస్త వెనకే ఉంటారు కానీ..

ఈ మధ్య ఈయన ఫారెన్ ట్రిప్పులు బాగా ఎక్కువైపోయాయి. అయితే హెల్త్ పరంగానే ఈయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ ఫారెన్ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే 50 రోజుల తర్వాత ఇండియాకు వచ్చారు ప్రభాస్.

యూరప్‌లో మోకాలి సర్జరీ చేయించుకున్నారీయన. ఆదిపురుష్ విడుదలయ్యాక కొన్ని రోజులు ఫారెన్ వెళ్లొచ్చిన ప్రభాస్.. ఆ తర్వాత సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్స్‌లో పాల్గొన్నారు. కానీ కాలి నొప్పి ఇబ్బంది పెట్టడంతో సెప్టెంబర్ చివరివారంలో యూరప్ వెళ్లారు.

50 రోజులక్కడే ఉన్న ప్రభాస్.. తాజాగా ఇండియాకు వచ్చారు. వచ్చీ రాగానే ఈయన షెడ్యూల్స్ అన్నీ బిజీ అయిపోయాయి. ఈ వారంలోనే ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో జాయిన్ కానున్నారు ప్రభాస్.

నవంబర్ లాస్ట్ వీక్ నుంచి సలార్ ప్రమోషన్స్‌తో బిజీ కానున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ ప్రమోషన్స్‌కు ఎక్కువ టైమ్ కేటాయించనున్నారు.

దానికితోడు సలార్ ప్యాచ్ వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూనే.. మారుతి సినిమా చేయాలనుకుంటున్నారు ప్రభాస్. మొత్తానికి 50 రోజుల హాలీడేస్ తర్వాత.. ఫుల్ బిజీ కానున్నారీయన.