
ప్రాడెక్ట్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎంత కష్టపడతామో, దాన్ని ప్రాపర్ మార్కెటింగ్ చేసుకునే విషయంలో కూడా శ్రద్ధ ఉండాలని ఫిక్సయ్యారట డార్లింగ్. లాంగ్ బ్యాక్ బాహుబలి టైమ్‌లో చూపించిన స్పీడ్‌ని ఇప్పుడు రీకాల్ చేసుకుంటున్నారు.

అందరూ ఊహించినట్టే జరిగింది. సెప్టెంబర్ 7న సలార్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ షాట్స్ తో ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ట్రైలర్ కట్ చేశారట ప్రశాంత్ నీల్. ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ని సెలబ్రేట్ చేయడం కోసం... ట్రైలర్ రిలీజ్ అయిన పది రోజుల తర్వాత భాగ్యనగరంలో ది బెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్

సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్, ప్రీ రిలీజ్‌లోనే కాదు, ఆ నెక్స్ట్ సినిమా విడుదలయ్యే వరకు కూడా ప్రమోషన్లకు టైమ్ కేటాయించడానికి ప్రిపేర్ అవుతున్నారు డార్లింగ్. ప్రమోషన్లను పీక్స్ కి చేర్చిన తర్వాత, సినిమా రిలీజ్‌కి జస్ట్ ముందుగా ఫారిన్ వెళ్లాలన్నది ప్లాన్.

ఫారిన్‌లో నీ సర్జరీ చేయించుకుంటారు డార్లింగ్. ఫారిన్ వెళ్లడానికి ముందు ఎక్కువ కాల్షీట్లను మారుతికి కేటాయించారు. ఓ వైపు సలార్ ప్యాన్ ఇండియా ప్రమోషన్లు, అడపాదడపా మారుతి మూవీ షూటింగ్‌ని కానిస్తారు. నీ సర్జరీ చేయించుకుని వచ్చాకనే కల్కి షూటింగ్‌కి వెళ్తారు.

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ విషయంలో జరిగిన పొరపాటును రిపీట్ చేయొద్దని డార్లింగ్‌కి సలహా ఇస్తున్నారట సన్నిహితులు. అందుకే ఈ సారి రాజమౌళి, ప్రశాంత్‌నీల్ ఫార్ములాను ఫాలో అవుతూ ప్రాడెక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు పబ్లిసిటీ చేయడానికి ఓకే చెప్పారట డార్లింగ్.