Ramayana: మొదటి పార్ట్ 2026 దివాళికి.. రెండో భాగం 2027 దివాళికి.! రామాయణ అప్డేట్..
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితిష్ తివారి తెరకెక్కిస్తున్న సినిమా రామాయణ. ఇందులో కేజియఫ్ ఫేమ్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా రెండు భాగాలుగా రాబోతుందని.. మొదటి పార్ట్ 2026 దివాళికి.. రెండో భాగం 2027 దివాళికి విడుదల కానుందని డిక్లేర్ చేశారు మేకర్స్. రామాయణ్ రిలీజ్ గురించి అఫీషియల్ ప్రకటన వచ్చీ రాగానే అందరికీ డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ గుర్తుకొస్తోంది.