
పండగంటే ఇలా ఉండాలి... ఇదీ పండగ.. సంతోషంగా, సంబరంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అంటూ పండగ చేసుకున్న తీరును వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నార్త్ సెలబ్రిటీలు. వినాయకుడిని చేయడం నుంచి, పండగ శోభ, నిమజ్జనం వరకు రకరకాల విజువల్స్ కన్నులపండువగా ఉన్నాయి.. మనమూ ఓ లుక్కేసేద్దామా మరి..

పిల్లలందరినీ ఒక్క చోట చేర్చి రితేష్ దేశ్‌ముఖ్ గణపతిని తయారు చేయించిన విధానం, పూజలు చేసిన తీరు, నిమజ్జనం చేసిన వైనం... నార్త్ జనాలను ఆకట్టుకుంటున్నాయి. పిల్లల్లో పండగ స్ఫూర్తిని నింపారు జెనీలియా దంపతులు అంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

గతంలో ఇలా షూటింగ్‌లో ఉన్నా... వీకెండ్ రెండు రోజులు ముంబై వెళ్లి బిగ్ బాస్ షూటింగ్‌లో పాల్గొనే వారు భాయ్‌జాన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా సాధ్యపడటం లేదు.

హీరోయిన్లు కూడా వినాయక చవితి రోజున గణపతిని ఇష్టంగా కొలిచారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కృతి సనన్, శిల్పాశెట్టి ఇంట్లో వినాయకుడి వైభవాన్ని కళ్లకు కడుతున్నాయి విజువల్స్.

అంబానీ ఇంట కొత్త జంట చేసిన సందడి కూడా వైరల్ అవుతోంది. గణేష్ నవరాత్రులు పూర్తయ్యేలోపు ఇలాంటి విజువల్స్ ఇంకెన్ని కనిపిస్తాయోనని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్.