
ప్రస్తుతం నిధి అగర్వాల్ పేరు సోషల్ మీడియా తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తూనే వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది నిధి.

ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హార్రర్ కామెడీ డ్రామాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మార్మోగిపోయింది.

రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో నిధి అగర్వాల్ ను ఉద్దేశిస్తూ ఓ అభిమాని ప్లకార్డు పట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. 'నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి.. ఎంత ఆస్తి ఉండాలి.. ఎలా ఉండాలి' అని రాసి ఉన్న ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డాడు.

అది చూసిన యాంకర్ సుమ, హీరో ప్రభాస్ సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని యాంకర్ సుమ నిధి దగ్గర ప్రస్తావించగా.. ప్రొఫెషన్ ఆఫ్ లవ్ లో ఉండాలంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ వేదికపై నిధి మాట్లాడిన తర్వాత చీరలోనే అన్ని నిధులూ ఉన్నాయని కామెంట్ చేసింది సుమ.

సుమ మాటతో ఈవెంట్ లో విజిల్స్ తో మార్మోగిపోయింది. ప్రస్తుతం నిధి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రాజాసాబ్ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జనవరి 9న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.