నయనతార స్ట్రాటజీ చూసి కళ్లు తిరుగుతున్నాయి ఫెలో ఆర్టిస్టులకు. ఓ వైపు స్టార్ హీరో సినిమాలో నటిస్తారు. కాసేపటికే మీడియం రేంజ్ మూవీకి ఓకే చెప్తారు. అన్నీ జోనర్లను, అన్నీ బడ్జెట్‌లను కవర్ చేస్తూ సినిమాలు చేస్తున్న లేడీ సూపర్‌స్టార్ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.
జవాన్ సినిమా కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతార అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నార్త్ లో ఆమె అందుకోబోయే సక్సెస్ గురించే వాళ్ల ఆసక్తి అంతా. సేమ్ టైమ్ నయనతార పెర్ఫార్మెన్స్ స్కిల్స్ ని ఎస్టిమేట్ చేయడానికి ఉత్తరాది వారు కూడా సిద్ధమవుతున్నారు. డెబ్యూ మూవీతోనే భారీ క్రేజ్ తెచ్చుకున్నారు నయన్.
ఓ వైపు స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడం ఆమె స్టైల్. ఈ విషయంలో ఆమెతో పోటీపడుతున్నవారెవరూ లేరని అంటోంది కోలీవుడ్. త్వరలోనే లోకేష్‌తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారట నయనతార. ప్రస్తుతం లియో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు లోకేష్.
లోకేష్ దర్శకత్వం వహించే సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తారట. ప్రస్తుతం చంద్రముఖి2 సినిమా పనుల్లో ఉన్నారు లారెన్స్. ఇది పూర్తి కాగానే లోకేష్ సెట్స్ కి వెళ్తారని టాక్. ఇంపాక్ట్ ఉన్న కథతో, తక్కువ వర్కింగ్ డేస్‌లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు లోకేష్.
నయనతార కూడా ఖాళీగా లేరు. సెట్స్ మీద మరో రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలున్నాయి. మణిరత్నం, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలోనూ నాయికగా ఆమె పేరే వినిపిస్తోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్‌లో పాటించాల్సిన అన్నీ పద్ధతులనూ పాటించేస్తున్నారు మిసెస్ విఘ్నేష్.