సెలబ్రిటీ లవ్ కపుల్స్‌లో మొదటి వరుసలో ఉంటారు నయన తార, విఘ్నేష్‌లు. 2015లో వచ్చిన 'నానుమ్ రౌడీ దామ్' సినిమాతో తొలిసారి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. దీంతో వీరి ప్రేమకు ఈ సనిమాలో బీజం ఏర్పడింది.
తాజాగా ఈ జంట ప్రేమ బంధానికి సరిగ్గా ఆరేళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని విఘ్నేష్ ట్వి్ట్టర్ వేదికగా స్వయంగా తెలిపాడు.
ఈ సందర్భంగా నయనతార, విఘ్నేష్‌లు కలిసి దిగిన కొన్ని అరుదైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు.
ఇన్నేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే నయనతార దోష నివారణ చర్యలో భాగంగా కొన్ని రకాల పూజలు కూడా చేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.