నాని, శ్రీకాంత్ ఓదెల సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మధ్యే సినిమా మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. నాని-ఓదెల సినిమాకు ‘నాయుడుగారి తాలూకా’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ టైటిల్ చూసిన తర్వాత కథ ఏమై ఉంటుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. తాజాగా నుంచి ‘హే తార’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ మొదలు అవుతాయని చెప్పారు దర్శక నిర్మాతలు.
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నుంచి ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 రానుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన మొదటి సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అక్టోబర్ 31, 2024న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రివాల్వర్ రీటా’. జెకె. చంద్రు దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్‌ని కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ టైటిల్ టీజర్‌లో పోలీసా, రా ఏజెంటా, డానా.. అంటూ ఫైనల్‌గా ‘రివాల్వర్ రీటా’గా కీర్తి సురేష్‌ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఓజి. ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైంది. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మొదలైన ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా దర్శకుడు సుజీత్.. సంగీత దర్శకుడు తమన్ కలిసి ఫోటోస్ పోస్ట్ చేసారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.