
టైమ్ మేనేజ్‌మెంట్‌లో బాలయ్యను కొట్టే హీరో టాలీవుడ్‌లోనే కాదు.. వెతికితే ఇండియన్ సినిమాలోనే దొరకరేమో..? ఎంత బిజీగా ఉన్నా.. ఎంతో కొంత టైమ్ ఆయన దగ్గర ఉంటుంది. ఓ వైపు వరస సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య..

తాజాగా మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. మరి అదేంటి.. అసలీయనకు అంత టైమ్ ఎక్కడ్నుంచి వస్తుంది..? బాలయ్య డిక్షనరీలో అసలు ఖాళీ అనే పదమే ఉండదేమో..? ఎప్పుడూ ఏదో ఓ పనితో బిజీగా ఉంటారీయన.

అయితే సినిమాలు చేస్తుంటారు.. లేదంటే పాలిటిక్స్‌లో బిజీగా ఉంటారు.. అదీ కాదంటే హాస్పిటల్ పనులంటారు.. ఇంత బిజీలోనూ డిజిటల్‌లో అడుగు పెట్టారు బాలయ్య. అక్కడా అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్నారు.

సంక్రాంతికి వీరసింహారెడ్డిగా వచ్చి విజయఢంకా మోగించిన బాలయ్య.. దసరాకు భగవంత్ కేసరిగా రాబోతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు త్వరలోనే బాబీ సినిమా సెట్స్‌పైకి రానుంది.

సినిమాల సంగతి పక్కనబెడితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయంగానూ బిజీగా ఉన్నారు నటసింహం. ఈ రెండింటినీ పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తున్నారు. సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య..

తాజాగా అన్‌స్టాపబుల్ 3కి సైన్ చేసారు. ఆహాలో వచ్చిన రెండు సీజన్స్‌కు రెస్పాన్స్ అదిరిపోయింది. సెకండ్ సీజన్ అంతా పొలిటికల్ వేడి రాజేసింది. తాజాగా దసరా నుంచి మూడో సీజన్ ప్లాన్ చేస్తున్నారు ఆహా టీం.

ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేసారు NBK. మొత్తానికి ఇంత బిజీలో టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్న బాలయ్యకు సలాం చెప్పాల్సిందే.