
అక్కినేని నాగార్జున నయా స్ట్రాటజీని డిజైన్ చేసుకుని ఫాలో అవుతున్నారా? సోలో మూవీస్ సో బెటర్ అనే కాన్సెప్ట్ కి ప్రస్తుతం కామా పెట్టేశారా? ప్యాన్ ఇండియా లెవల్లో పాపులర్ స్టార్స్ తో కొలాబరేట్ కావడానికి సై అంటున్నారా? ఇంతకీ కింగ్ మనసులో ఏం ఉంది? నియర్ ఫ్యూచర్‌లో ఆయన ఎలా కనిపించనున్నారు?

ఎట్ ప్రెజెంట్ ధనుష్‌తో కుబేర సినిమాలో కలిసి నటిస్తున్నారు కింగ్. శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో నాగ్‌తో ధనుష్ చేస్తున్నారని చెప్పాలంటున్నారు అక్కినేని అభిమానులు.

ఎక్స్ పీరియన్స్డ్ పీపుల్ ఎప్పుడూ ఒక్క ప్లాన్‌కే స్టికాన్ అవ్వరు. ప్లాన్ ఎ వర్కవుట్ కాకపోతే వెంటనే ప్లాన్ బీకి షిఫ్ట్ అవుతారు. అది కూడా అంతంతమాత్రంగా సాగితే, ఉండనే ఉంటుంది ప్లాన్ సీ..

వరుసగా అలాంటి ప్రాజెక్టులకే సైన్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్రలో కింగ్ నాగ్ చేసిన రోల్ చూశాక, స్పెషల్, ప్రామినెంట్ రోల్స్ కి ఆయన్ని అప్రోచ్ కావచ్చనే ఫీలింగ్ వచ్చేసింది మేకర్స్ కి.

ఈ కేటగిరీలో ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కనిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఫాలో అవుతున్న ప్లానింగ్ ఏంటి.? సినిమాలు సోలోగా క్లిక్ కాకపోతే, మల్టీస్టారర్ ఆప్షన్ ఉండనే ఉంది కదా అనుకున్నట్టున్నారు కింగ్ నాగార్జున.