
సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు కథ నచ్చక, తమకు ఆ కథ సెట్ కాదు అని లేదా, వేరే సినిమా షూటింగ్స్ లలో బిజీ గా ఉంటూ కొన్ని కథలను రిజక్ట్ చేస్తారు. కానీ ఆ కథతోనే వేరే హీరో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారు. అయితే అలానే అక్కినే నాగచైతన్య కూడా పలు సినిమాలు రిజక్ట్ చేశాడంట. ముఖ్యంగా సమంతతో నటించాల్సిన మూవీని వదులుకున్నాడంట. ఇంతకీ అది ఏ మూవీ అంటే?

అక్కినేని నాగచైతన్య, సమంత కాంబోలో ఏ సినిమా వచ్చినా సరే అది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏమాయ చేశావే, మజిలీ, ఆటోనగర్ సూర్య, మనం సినిమాలు మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇవే కాకుండా వీరి కాంబోలో మరో సినిమా కూడా రావాల్సి ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ ఆ సినిమాలో సమంత హీరోయిన్‌గా, నితిన్ హీరోగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాగచైతన్య నటించాల్సి ఉండగా, ఈ చై ఈ సినిమాను రిజక్ట్ చేశాడంట.

అలా సమంత, నాగచైతన్య కాంబోలో రావాల్సిన ఆ ఆ మూవీ మిస్ అయ్యిందంట. ఇదే కాకుండ నాగచైతన్య కొత్త బంగారు లోకం సినిమాతో వెండితెరకు పరిచయం కావాల్సిందంట. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి నాగార్జున చైతూని తప్పించినట్లు సమాచారం.

అదే విధంగా అక్కినేని నాగచైతన్య సమ్మోహనం, వరు కావలెను వంటి సినిమాలో నటించాల్సి ఉండగా, వీటిని కూడా ఈ హీరో రిజక్ట్ చేసినట్లు తెలస్తోంది.