5 / 5
అఖండ తర్వాత ప్రగ్యా జైస్వాల్ జాతకం మారిపోతుందనుకున్నారంతా. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది ఆమె కెరీర్. దాంతో బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు ప్రగ్యా. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే.. అనే సినిమాలో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ దీనికి దర్శకుడు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత అటు నభా నటేష్.. ఇటు ప్రగ్యా జైస్వాల్ మళ్లీ అవకాశాలు దక్కించుకుంటున్నారు.