
హీరో అంటే ఆజానుభాహుడు.. ఆరడుగుల అంధగాడు. భూతద్దం పెట్టి వెతికినా మచ్చ కనిపించనంత మంచోడు. ఇదంతా పాత మాట. ఇప్పుడు హీరో అన్న పదానికి అర్ధం వేరే. ఎలాగైనా గెలిచేవాడు.. తను అనుకున్నది సాధించేవాడే హీరో. ప్రస్తుతం ఇదే వెండితెర మీద కనిపిస్తున్న నయా హీరోయిజం.

మంచీ చెడు కాదు... గెలిచిన వాడే హీరో అన్నదే ప్రస్తుతం మన సినిమా కథల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్. హీరోయిజాన్ని మరో లెవల్‌లో ఎలివేట్ చేసేందుకు సలార్ లాంటి రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్స్‌ను ఎంచుకుంటున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా అలాంటి కథలతోనే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. కాసుల పంట పండిస్తున్నారు.

అనుకున్నది సాధించాడానికి కథానాయకుడు ఎంత వయలెంట్‌గా మారితే హీరోయిజం అంతే బాగా ఎలివేట్ అవుతుందన్నది నయా జమానా సినిమా ట్రెండ్. తన పేరు ఓ బ్రాండ్‌గా నిలిచిపోవాలన్న కల రాకీబాయ్‌కిది అందుకే ముంబై వీదుల నుంచి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వరకు అడ్డొచ్చిన ప్రతీ ఒక్కరిని అంతం చేసిన అనుకున్న సాధించాడు.

ఎర్రచందనం సామ్రాజాన్ని ఏలాలన్నది పుష్పరాజ్ డ్రీమ్. అందుకే తప్పు రైటు అన్న లెక్కలు చూడకుండా స్మగ్లింగ్ సామ్రాజ్యాన్నికి కింగ్ ఎదిగాడు. ఈ జర్నీలో తనకు అడ్డొచ్చిన చాలా మందిని అంతం చేసి చివరకు అనుకున్నది సాధించాడు. ఇప్పుడు కథకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 మీద కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

యంగ్ హీరోలు మాత్రమే కాదు చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్ కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిజాన్నే చూపిస్తున్నారు. గ్యాంగ్ స్టర్, స్మగ్లర్ క్యారెక్టర్స్‌తో కనిపించి ఆకట్టుకున్నారు మెగాస్టార్.