చల్ మోహన్ రంగ అంటూ తెలుగు కుర్రాళ్ల గుండెలను దొచేసింది అందాల మేఘ. ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.