Phani CH |
Jun 12, 2022 | 3:17 PM
విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి లోకనాయకుడు కమల్ హాసన్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
హైదరాబాదులో ఉన్న తన చిరకాల మిత్రుడు కమల్ ను చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించారు.
కమల్‌హాసన్, హిందీ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
ఈ మేరకు విక్రమ్ టీంను సత్కరించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
'నా పాత స్నేహితుడిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు అభినందనలు మిత్రమా' అని చిరు ట్వీటారు.
దీంతో ఈ అపూర్వ కలయిక చూసి ఇరువురి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.