
2002లో వచ్చిన 'మన్మథుడు' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది అన్షు. ఇందులో మహేశ్వరి అనే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించిందీ ముద్దుగుమ్మ.

మన్మథుడు సినిమా తరవాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ అనే సినిమాలో.. ‘మిస్సమ్మ’ అనే మరో సినిమాలో గెస్ట్ రోల్‌లో మాత్రమే కనిపించింది అన్షు.

ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై లండన్‌కు వెళ్లి అక్కడే సెటిలైపోయింది. 2003లో సచిన్ సగ్గార్ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది అన్షు.

కాగా చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చేసిన అన్షు తాజాగా వైజాగ్ బీచ్ అందాలను ఆస్వాదిస్తూ కనిపించింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడు మేడమ్ అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.