
టాలీవుడ్ ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఏకైక కుమార్తె విద్యా నిర్వాణ ఓణీ వేడుక (హాఫ్ శారీ ఫంక్షన్) ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరై విద్యా నిర్వాణను ఆశీర్వదించారు.

కాగా ఈ వేడుకలో మంచు లక్ష్మీ సోదరుడు, హీరో మంచు మనోజ్ హైలైట్‌గా నిలిచాడు. తన మేనకోడలిని పల్లకిలో ఎక్కించి స్వయంగా వేదికపైకి తీసుకురావడం, అన్ని పనులను దగ్గరుండి చూసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

విద్యా నిర్వాణ ఓణీల వేడుకకు మంచు లక్ష్మీ తల్లి, అలాగే మనోజ్ భార్య భూమా మౌనికా రెడ్డి తదితరులు హాజరై చిట్టి తల్లిని మనసారా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన కూతురు ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ పెట్టింది.

'నా కుమార్తె విద్య నిర్వాణ ఆశీర్వాద వేడుక ఇది. ఇంత అందమైన వేడుకను నిర్వహించడంలో నాకు సహాయపడిన నా డ్రీమ్ టీమ్‌కు కృతజ్ఞతలు. అలాగే నా కుమార్తెను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని తన ఆనందాన్ని పంచుకుంది.

ఈ ఫొటోలను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యా నిర్వాణ ఎంతో ముద్దుగా, అందంగా కనిపిస్తోందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

మోహన్ బాబు ఏకైక కూతురైన మంచు లక్ష్మి.. 2006లో ఐటీ ప్రొఫెషనల్ ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లి చేసుకుంది. 2014 జూన్‌లో సరోగసీ ద్వారా విద్యా నిర్వాణ జన్మించిందామె. ప్రస్తుతం సినిమాలతో పాటు తన కూతురు ఆలనాపాలనలో ఈ నటి బిజీ బిజీగా ఉంటోంది