
ఏం చేసినా ఈ ఏడాదే.. ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు.. న్యూ ఇయర్ స్టార్టింగ్‌లోపు చేసేయాలని సూపర్‌స్టార్ మహేష్ ఫిక్సయ్యారా.? ఆ తర్వాత రెండేళ్లు ఏదీ కుదరదన్న క్లారిటీ మహేష్‌కి వచ్చేసిందా.?

అంతలా ఆయన మైండ్‌ని ఫిక్స్ చేసిన క్రెడిట్ జక్కన్నదేనా.. ఎస్ఎస్ఎంబీ29 గురించి మరికొన్ని విశేషాలు.. ఇయర్ ఎండింగ్ ట్రిప్పులకు ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా మహేష్ మాత్రం ముందుంటారు.

ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్పులకు వెళ్తుంటారు మహేష్. ఈ ఏడాది కూడా ఆల్రెడీ ప్లానింగ్స్, టిక్కెట్ బుకింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే ఉంటాయి.

నెక్స్ట్ రెండేళ్ల పాటు కుదురుతుందో లేదో తెలియదు కాబట్టి ఈ ఇయర్ ప్లానింగ్ కాస్త స్ట్రాంగ్‌గానే ఉందన్నది సమాచారం.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి వెళ్లిన మహేష్ త్వరగా రిటర్న్ అయితే జనవరి 15 తర్వాత మంచి ముహూర్తం చూసుకుని సినిమాను స్టార్ట్ చేయాలన్నది జక్కన్న ప్లాన్. నెక్స్ట్ రెండేళ్ల పాటు లుక్ రివీల్ అవుతుందనో,

ఇంకో రీజన్‌తోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సూపర్‌స్టార్ వెళ్లలేని పరిస్థితి వస్తే.. ఆ మేరకు ఈ ఏడాదే కవర్ చేసేయాలనుకుని, ట్రిప్ నుంచి లేట్‌గా వస్తే మాత్రం మార్చి తర్వాతే రెగ్యులర్ షూట్‌ని ప్లాన్ చేయాలనుకుంటున్నారు జక్కన్న.

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కనుంది ఎస్ ఎస్ ఎంబీ 29. మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుందనే హింట్స్ అందుతున్నాయి. ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ప్రాజెక్ట్ తో కొలాబరేట్ కానున్నారు.

ఇటు సూపర్‌స్టార్ ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్ హీరో కావడం పక్కా... వెయ్యికోట్ల బడ్జెట్ అనే మాటలతో ఆల్రెడీ విపరీతమైన హైప్ తెచ్చుకుంది ప్రాజెక్ట్.