- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu and Namrata wedding photos are viral on social media
అందమైన 20 ఏళ్లు..మహేష్ బాబు పెళ్లి ఫొటోలపై ఓ లుక్ వేయండి!
టాలీవుడ్ లవ్‌లీ కపుల్ మహేష్ బాబు, నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు ప్రేమించి, పెద్దల అంగీకరంతో వివాహం చేసుకున్నారు. ఈ కపుల్ అంటే చాలా మందికి ఎనలేని అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కుటుంబంతో కలిసి కనిపించడం, ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, ముఖ్యంగా మహేష్ బాబుతో వివాహం తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పి తన ఫ్యామిలీని, మహేష్ బాబును ప్రేమగా చూసుకోవడం చాలా మందికి నచ్చుతుంది.
Updated on: Feb 10, 2025 | 5:03 PM

ముఖ్యంగా నమ్రత మహేష్ బాబు విషయాలన్నింటినీ చూసుకోవడమే కాకుండా వ్యాపార పనులతో పాటు ఇళ్లు, పిల్లల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమాలకు ఎంత సమయం కేటాయిస్తాడో, తన ఫ్యామిలీకి కూడా అంతే సమయం కేటాయించి, వారితో కలిసి ఎంజాయ్ చేస్తాడు. వెకేషన్స్‌కు వెళ్తూ వారితో సరదాగా గడుపుతాడు.

అయితే నేటికి వీరు వివాహం చేసుకొని 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మహేష్ బాబు నమ్రతకు క్యూట్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఓ క్యూట్ ఫొటోను ఆయన షేర్ చేస్తూ.. నువ్వు, నేను, అందమైన 20 ఏళ్లు. ఎప్పటికీ నీతోనే నమ్రత అంటూ లవ్ ఈమోజీని షేర్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ హీరో వైవాహిక జీవితం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ క్యూట్ కపుల్ పెళ్లి ఫొటోలపై మనం ఓ లుక్ వేద్దాం.. వారి వివాహ ఫొటోలను చూసేద్దాం.





























