
మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఇదే సినిమాతో పరిచయం అయ్యింది.

ఆతర్వాత తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు చేసి మెప్పించింది ఈ చిన్నది. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గాను నటించింది.

నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. రీసెంట్ గా లియో సినిమాలో మెరిసింది మడోనా

లియో సినిమాలో దళపతి విజయ్ సిస్టర్ గా కనిపించింది. డ్యాన్స్ లో ఆయనకు పోటీగా స్టెప్పులేసి అదరగొట్టింది మడోనా సెబాస్టియన్.

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వదిలింది. జిమ్ లో కష్టపడిన తర్వాత మిర్రర్ లో ఫోటోలు దిగింది. ఈ ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ కలర్ లో వదిలింది.