అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.
అందాల రాక్షసి సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది జాన్వీ. ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ.
ఇక త్వరలోనే మెగా కోడలిగా మారనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను లావణ్య పెళ్లాడనుంది. ఈ ఇద్దరు గతకొద్ది సంవత్సరాలుగా ప్రేమలో తేలిపోతున్నారు.
లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్ కలిసి మిస్టర్ అనే సినిమా చేశారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. అప్పటి నుంచి ఎవ్వరికి తెలియకుండా తమ ప్రేమాయణాన్ని నడిపారు.
ఇటీవలే కాబోయే వాడితో కలిసి పెళ్లి షాపింగ్ కూడా చేసింది ఈ భామ. తాజగా మెగా కోడలు లావణ్య షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చీరకట్టులో చూడచక్కగా ఉంది లావణ్య.