
ఏదైనా నేను దిగనంతవరకే, ఒన్స్ నేను గ్రౌండ్‌లోకి దిగితే, వార్ ఒన్ సైడే అని స్ట్రాంగ్ హింట్ ఇస్తున్నారు నటి నయనతార. మొన్న మొన్నటి దాకా సోషల్ మీడియాలో నయన్ యాక్టివ్‌గా లేరు.

ఒకవేళ ఉన్నా, ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ కి బ్లూ టిక్స్ లేకపోవడంతో చాలా మందికి, వాటిని హ్యాండిల్ చేస్తున్నది నయనతారేనా అనే అనుమానాలు కూడా ఉండేవి. కానీ ఇదంతా జవాన్ సినిమాకు ముందు. ఇప్పుడు సీన్ మారింది. సోషల్ మీడియాలో సందడి మారింది. పెళ్లి తర్వాత నయన్ తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు.

తంగమే అంటూ ఆమె భర్త ఏదో ఒక అకేషన్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా 'నా ఉయిర్స్' అంటూ కొడుకు ఉయిర్‌ని కాళ్ల మీద పడుకోబెట్టుకుని నయన్ తీసుకున్న ఫొటోని షేర్ చేశారు.. ఆ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఉయిర్ అంటే ప్రాణం అని అర్థం. నయనతారను, కొడుకును ఇద్దరినీ కలిపి విఘ్నేష్ శివన్ ఉయిర్స్ అని మెన్షన్ చేయడం సో క్యూట్ అంటున్నారు జనాలు. నయనతార ఇటీవల చేసిన హాట్ ఫొటో షూట్ కూడా తెగ వైరల్ అయింది.

అప్పుడెప్పుడో రాజా రాణీ టైమ్‌లో కాస్త ల్యాంగ్ వైట్ షర్ట్ వేసుకుని బాతింగ్ టవల్‌తో ఓ ఫోజు ఇచ్చారు నయన్. ఆ తర్వాత ఆమె అంత హాట్‌గా కనిపించింది రీసెంట్ ఫొటో షూట్స్ లోనే. అప్పట్లో అట్లీ సినిమా కోసం ఫొటో షూట్ చేశారు.

ఇప్పుడు అట్లీ జవాన్ తర్వాత ఫొటో షూట్ చేశారు అంటూ నయన్ పిక్స్ ని ఇష్టంగా వైరల్ చేశారు ఫ్యాన్స్. జవాన్ తర్వాత నయన్ బాలీవుడ్‌లో మరో సినిమాలో చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్‌లో ఓ కీల్ రోల్ చేయడానికి సైన్ చేశారు నయన్.

ఇందులో ఆల్రెడీ రణ్‌వీర్‌సింగ్, ఆలియా జోడీగా నటిస్తున్నారు. అలాంటప్పుడు నయన్ చేసే కేరక్టర్ ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు జనాలు. హిస్టారికల్ కేరక్టర్లను నయన్ మరింత గ్రేస్‌తో క్యారీ చేస్తారు. కాబట్టి ఈ సారి నార్త్ లో జెండా పాతడం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది లేడీ సూపర్‌స్టార్ ఫ్యాన్స్ సర్కిల్స్ లో.