
ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతో టాలీవుడ్ అభిమానుల మనసు దోచేసుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఉప్పెన తర్వాత చాలా సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.

కృతి శెట్టి మెగా హీరో సరసన ఉప్పెన సినిమాలో నటించి, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ఆ అమ్మాయి గురిచి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, మనమే, కస్టడీ వంటి చాలా సినిమాల్లో నటించింది.

అయితే ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఉప్పెన, బంగార్రాజు తప్ప మిగితా సినిమాలన్నీ ఈ బ్యూటీ నటించిన ఏ సినిమాలు హిట్ అందుకోలేకపోవడంతో, ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ పై కన్నేసి అక్కడ పలు సినిమాలు చేస్తుంది.

ఇక కృతి శెట్టి సినిమాల పరంగా తన అభిమానులకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో పలు ఫొటోలు షేర్ చేసింది.

తాజాగా ఈ చిన్నది డిఫరెంట్ ఫోజులతో, కిర్రాకు లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నదాన్ని చూస్తే మతిపోవాల్సిందే. అంత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.