
కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు బుచ్చి బాబు సనా దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పెన సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని, స్టార్ హీరోయిన్ రేంజ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఉప్పెన మూవీలో బేబమ్మ గా నటించి, ఆ పాత్రలో తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకొని, కుర్రకారు ఫేవరెట్ అయిపోయింది. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే సీనియర్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఈ అమ్మడుకు మాత్రం అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి.

ఈ మూవీ తర్వాత ఈ చిన్నది టాలీవుడ్‌లో చాలా అవకాశాలు అందుకుంది. దాదాపు వరసగా రెండు మూడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేసింది. కానీ లక్కు మాత్రం కలిసిరాలేదు. చేసిన సినిమాలు దాదాపు అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్ ఐరన్ లెగ్‌గా మారిపోయింది ఈ అందాల చిన్నది.

దీంతో మెల్లిగా తెలుగులో అవకాశాలు తగ్గడం మొదలు అవ్వడంతో ఈ బ్యూటీ కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ పై కన్నేసి, అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టి్వ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా, చీరలో తన అందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.