జాబిలమ్మకి చెల్లెలు ఏమో ఈ సుకుమారి.. వెన్నెలకే పోటీ ఇస్తున్న కృతి..

Updated on: Nov 17, 2025 | 4:39 PM

కృతి శెట్టి తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది, ముంబైలో పెరిగింది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో  ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి.

1 / 5
21 సెప్టెంబరు 2003న ముంబైలోని కర్నాటక మంగళూరుకు చెందిన తుళు కుటుంబంలో జన్మించింది అందాల తార కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ తండ్రి కృష్ణ శెట్టి ఓ వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్నారు. చాల చిన్న వయసులోనే టీవీలో వచ్చే కొన్ని ప్రకటనలలో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

2 / 5
చిన్నతనం కృతి శెట్టి ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్‌బాయ్ వంటి పలు బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 

3 / 5
కృతిశెట్టికి 2021లో వచ్చిన తెలుగు చిత్రం ఉప్పెనతో గుర్తింపు లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో కృతిశెట్టి నటనకు ప్రశంసలు అందాయి.

4 / 5
ఆ తర్వాత ఆమె శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించింది. అయితే, ఆ తర్వాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే వంటి కొన్ని చిత్రాలు కమర్షియల్ గా నిరాశపరిచాయి. దీంతో తెలుగులో కృతిశెట్టికి అవకాశాలు తగ్గాయి.

5 / 5
గత ఏడాది మలయాళంలో ARM అనే సినిమాలో నటించింది. ఇది బ్లక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఈ చిన్నది తమిళ సినిమాలపై దృష్టి సారించింది. కార్తీకి జోడిగా వా వాతియార్,  ప్రదీప్ రంగనాథన్ సరసన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలాగే జెనీ అనే మూడు తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. 