
తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెనలా దూసుకొచ్చి.. తక్కువ గ్యాప్‌లోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో హిట్స్ కొట్టేసింది కృతి శెట్టి. కానీ తర్వాతే ఆమె సినిమా తిరగబడింది.

మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ.. గతేడాది మనమే ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఢమాల్ అని పడిపోయింది. ఈమె చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలేమీ లేవు.

మనమే తర్వాత ఈమె వైపు చూడ్డమే మానేసారు తెలుగు మేకర్స్. తెలుగులో ఆఫర్స్ రాకపోయినా.. తమిళంలో మాత్రం అమ్మడి జోరు మామూలుడా లేదు. అక్కడ స్టార్స్‌తో వరస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కృతి.

తాజాగా ప్రదీప్ రంగనాథన్‌తో నటిస్తున్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ షూటింగ్ పూర్తైంది. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకుడు. జయం రవితో జీని సినిమాలోనూ కృతి శెట్టినే హీరోయిన్. అలాగే కార్తి హీరోగా నటిస్తున్న వా వాతియార్‌లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ.

వీటితో పాటు మరో రెండు తమిళ సినిమాలు కూడా కృతి చెంత చేరేలా ఉన్నాయి. గుర్తింపు తీసుకొచ్చిన టాలీవుడ్ ప్రస్తుతానికి పక్కనబెట్టినా.. పక్కనే ఉన్న కోలీవుడ్ మాత్రం అమ్మడికి అదిరిపోయే అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తుందన్నమాట.