
తెలుగులో ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్లను కట్టిపడేసింది. అందం, అభినయంతో తెలుగు సినీప్రియుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ ఈబ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గానూ కనిపించింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఆదా శర్మ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా బాక్సాఫఈస్ వద్ద నిరాశ పరిచింది. కానీ ఆదా శర్మ మాత్రం అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించింది.

ఇక తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ నార్త్ అడియన్స్ మనసులు గెలుచుకుంది. కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై మనసు పారేసుకుంది ఆదా శర్మ. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలతో మతిపోగొట్టేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన వైట్ డ్రెస్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.