
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తింపు తెచ్చుకుంటుంది. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ స్టార్ హీరోయిన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. అన్ని భాషలలో కలిపి మూడు సినిమాల్లో నటిస్తే అన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఆ బ్యూటీ ఎవరంటే.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. భాగ్య శ్రీ బోర్సే. ఈ మధ్య మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

కానీ ఈ సినిమాతో భాగ్య శ్రీ బోర్సే మాత్రం చాలా ఫేమస్ అయ్యింది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్, అందంగా డ్యాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులుక తెగ నచ్చేసింది ఈ అమ్మడు.

మోడలింగ్ రంగం నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన భాగ్య శ్రీ బోర్సే.. యారియాన్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో ఆమె నటించిన చిత్రాలు అంతగా మెప్పించలేకపోయాయి.

మిస్టర్ బచ్చన్ సినిమా సైతం ప్లాప్ అయినప్పటికీ భాగ్య శ్రీ బోర్సెకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. అలాగే మరో ఆరు చిత్రాల్లో నటిస్తుంది.